- దారి పొడవునా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు ర్యాలీకి ఘన స్వాగతం
- సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రజలు
- హోరెత్తిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తల నినాదాలు
- ఆలయాల్లో పూజలు, దర్గాలో ప్రార్థన ర్యాలీ ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్
- ఆరు గ్యారెంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు ఖాయం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు ర్యాలీ స్పష్టం చేసింది. అశేష జనవాహిని నడుమ చేపట్టిన నామినేషన్ ర్యాలీ ఎన్నికలకు ముందే గెలుపు సునాయాసమని తేల్చి చెప్పింది. జగదీష్ అన్న వెంట తామున్నామని..భారీ మెజారిటీతో గెలిపిస్తామన్న ప్రజల మాట నేడు పెద్ద ఎత్తున కనిపించిన జనసంద్రం మరింత బలాన్ని చేకూర్చింది.
నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ దాఖలు ర్యాలీకి అశేష జన వాహిని ఘన స్వాగతం పలికింది. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, అభిమానులు దారి పొడవునా నినాదాలతో హోరెత్తించారు. అయితే ర్యాలీ ప్రారంభానికి ముందు నల్లగండ్ల మల్లన్న దేవాలయం, హైదరనగర్ జై మైసమ్మ ఆలయం, లింగంపల్లి లోని తుల్జా భవానీ ఆలయాలలో నామినేషన్ పత్రాలు ఉంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదర్ నగర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. హైదరనగర్ నుంచి మియాపూర్ చందానగర్, లింగంపల్లి మీదుగా జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతేగాక ర్యాలీ… మార్గమధ్యలో హైదరనగర్, చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మహనీయుడి ఆశీస్సులు పొందారు. అనంతరం జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తానని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. మియపూర్, మదినగూడా, చందానగర్, తారానగర్, ఆదర్శ నగర్ వద్ద జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ ర్యాలీకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి ఆయనను గజమాలతో సత్కరించారు.
ర్యాలీలో జగదీశ్వర్ గౌడ్ తో పాటు హఫీజ్ పెట్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పోరేటర్ భాను ప్రసాద్, హైదరనగర్ మాజీ కార్పొరేటర్ జానకి రామరాజు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.