- దారిపొడవుగా డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికిన హఫీజ్ పేట్ డివిజన్ 109 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్
నమస్తే శేరిలింగంపల్లి : వివేకానంద నగర్ లోని తన ఇంటి నుండి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద హఫీజ్ పేట్ డివిజన్ 109 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ర్యాలీని విజయవంతం చేశారు.
అనంతరం గులాబీ మాలతో సత్కరించి యుద్దానికి చిహ్నంగా గదని బహూకరించారు. ర్యాలీ విజయవంతానికి కృషి చేసిన మైనారిటీ సోదరి సోదరీమణులకు, డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, శ్రేయోభిలాషులకు పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికీ బాలింగ్ గౌతమ్ గౌడ్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆరెకపూడి గాంధీ నామినేషన్ ర్యాలీతో పగటి పూట ప్రతిపక్షాలు గల్లంతయ్యాయన్నారు.