- పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ లో పర్యటించారు. ఇందిరా నగర్ కాలనీలో రూ. 3.కోట్ల 70 లక్షలతో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి , GHMC అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం గా దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజలకు వర్షాకాలంలో నెలకొన్న ఇబ్బందులు, వరద ముంపు వంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకొని నేడు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ శంకర్ నాయక్, ఈఈ శ్రీకాంతిని ఏఈ సంతోష్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీనాయకులు అంజద్ పాషా, గిరి, అప్సర్ , షరీఫ్, కార్యకర్తలు పాల్గొన్నారు.