నమస్తే శేరిలింగంపల్లి: విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి యువజన నాయకుడుగా, రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసి, మూడుసార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేస్తూ నేడు మూడోసారి రాష్ట్ర అధ్యక్షులుగా నాంపల్లి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టేడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.