అన్నదానం మహాదానం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో ఆర్య వైశ్య అమావాస్య అన్నదానం కమిటీ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్న ప్రసాదాలు వడ్డించారు.

చందానగర్ లో ఆర్య వైశ్య అమావాస్య అన్నదానం కమిటీ శేరిలింగంపల్లి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమంలో భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, అన్ని దానంల కన్నా అన్నదానం గొప్పదని, పేద ప్రజలకు ఆకలి తీర్చే గొప్ప కార్యక్రమని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గాంధీ అభినందించారు.

అన్నదాన కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో..

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ.వెంకటేష్, పబ్బా మల్లేష్ , పులిపాటి నాగరాజు, అక్బర్ ఖాన్, అంజద్ పాషా, సందీప్ రెడ్డి, అవినాష్ , పి శ్రీనివాస్, జయ కృష్ణ, గోలి రాజు, సత్యనారాయణ గంప, వర్మ శ్రీనివాస్, ప్రభాకర్, శ్రీనివాస్, నటరాజ, లక్ష్మణ్, చిన్న, వెంకట్, విష్ణు, బాబే పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here