ఘన స్వాగతం పలుకుదాం.. చురుకుగా పాల్గొనండి

  • కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కి స్వాగతం పలికేందుకు సన్నాహాక సమావేశం
  • పిలుపునిచ్చిన అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి,  శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : రేపు (గురువారం) హైదరాబాదుకు విచ్చేయుచున్న కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ కి ఘన స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా మసీదు బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన సన్నాహాక సమావేశం నిర్వహించారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి,  శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. రేపు జరగబోయే కార్యక్రమాలను పార్టీ సూచించిన, చేపట్టవలసిన కార్యక్రమాలు, విధి విధానాల గురించి చర్చించారు.

సన్నాహాక సమావేశంలో మాట్లాడుతున్న అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి,  శేరిలింగంపల్లి ఇన్చార్జి రవికుమార్ యాదవ్

రేపు రానున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలివెళ్ళి ఘన స్వాగతం పలకాలని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీ బలోపేతానికి చేయవలసిన పనుల కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.  ప్రతి ఒక్కరూ వారి వారి బూత్ లు, డివిజన్లలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నాయకులందరూ మీకు అందుబాటులో ఉంటారని అన్నారు.

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా (అర్బన్) అధ్యక్షుడు సామా రంగారెడ్డి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,  కో కన్వీనర్ మనిభూషణ్ , రామరాజు, నవతా రెడ్డి, వెలగా శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్, ఆంజనేయులు, నరసింగ్ రావు, నవీన్ గౌడ్, కృష్ణ ముదిరాజ్, కమలాకర్ రెడ్డి,  రాజు శెట్టి, సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, కృష్ణం రాజు, నరేందర్ ముదిరాజ్, దయాకర్, శేషయ్య, చారి, సీతా రామరాజు, రవీందర్ రెడ్డి, నరసింహ రావు, రాజు, కేశవ, పద్మ, మేరీ, రేణుకా, రామిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here