విద్యుత్ సమస్యలు పరిష్కరించండి

  • ఎమ్మెల్యే గాంధీని కలిసి విన్నవించుకున్న సుమధుర అపార్ట్ మెంట్స్ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి నానక్ రామ్ గూడలోని సుమధుర అపార్ట్ మెంట్స్ లో  నెలకొన్న విద్యుత్ సరఫరా  సమస్య పై మాజీ కార్పొరేటర్ సాయి బాబా, విద్యుత్ శాఖ అధికారులు, అపార్ట్ మెంట్స్ వాసులతో కలిసి  ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్థానికంగా పర్యటించారు.  ఈ సందర్భంగా అపార్ట్ మెంట్స్ వాసులు ఎమ్మెల్యే గాంధీకి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి రోజు 18 సార్లు కరెంట్ పోతుందని, ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ  సుమధుర  అపార్ట్మెంట్ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు పర్యటించామని, కరెంట్ అంతరాయం తీవ్రంగా ఉందని రోజుకి 18 సార్లు కరెంట్ పోవడం చాలా బాధాకరమన్నారు.

ఎమ్మెల్యే గాంధీకి పూల బొకే అందిస్తున్న సుమధుర అపార్ట్ మెంట్స్ వాసులు

లో వోల్టేజ్ వల్ల కరెంట్ అంతరాయం ఏర్పడుతుందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు తెలిపారు. అవసరమైతే సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని, అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్  సరఫరా అయ్యేలా చూడాలని,  మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రశాంతమైన వాతావరణం కలిపించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఏడీఈ చరణ్ , ఏఈ వేణుగోపాల్ గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, నరేష్, నారాయణ, గోవింద్, రామిరెడ్డి,  సుమధుర అపార్ట్మెంట్స్ చైర్మన్ పీ.వీ చౌదరి, రామారావు, దేవి రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రదీప్ కుమార్, ఎం.ఎస్ రావు, రాంనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here