- హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 72వ వారంతపు అన్నదానం
- ప్రారంభించిన జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
నమస్తే శేరిలింగంపల్లి : హోప్ ఫౌండేషన్ సేవలు అసాధారణమైనవని, అన్నదానం చేసేవారే నిజమైన ధనవంతులని జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న “వారాంతపు అన్నదానం” (71 వారాలుగా) ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానాలలోకి గొప్పదానం అన్నదానం అని పేర్కొన్నారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపితే కలిగే సంతృప్తి మాటల్లో వర్ణించలేమని తెలిపారు. హోప్ ఫౌండేషన్ స్థాపకుడు కొండ విజయ్ కుమార్ పేదల పాలిట ఆశా కిరణం అని కొనియాడారు.
ఈ ఫౌండేషన్ తరపున అణగారిన వర్గాలకు, అనాథలకు, పేదలకు, పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు.
కొండ విజయ్ కుమార్ బంగారు ఆభరణాలు ధరించడం వల్ల “గోల్డ్ మ్యాన్”గా ప్రసిద్ధులు. కానీ, ఆయన హృదయం నిజమైన బంగారం అని తెలిపారు. సమాజ సేవలో ఆయన చేసే సేవలు బంగారానికి మించినవని దుండ్ర కుమార స్వామి కొనియాడారు.
అన్నదాన కార్యక్రమం 71 వారాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా కుమార స్వామి హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండ విజయ్ కి అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు ఇంకా కొనసాగించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.