- ప్రకటించిన బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ
నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంసిపి(యు) అభ్యర్థిగా వనం సుధాకర్ ను బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఓంకార్ భవన్ బాగ్ లింగంపల్లి హైదరాబాదులో మొదటి విడతగా రాష్ట్రంలో పోటీ చేయనున్న ఐదుగురు అభ్యర్థులను ఎంసీపిఐ(యు) అఖిల భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, బిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్ ప్రకటించారు. చేవెళ్ల పార్లమెంటు స్థానానికి మియాపూర్ ప్రాంత స్టాలిన్ నగర్ నివాసి, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ వనం సుధాకర్ ను ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తున్న బిఎల్ఎఫ్, బహుజన ప్రజానీకాన్ని చట్టసభలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులను పోటీ చేయించిందని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని అనేక ప్రజా పోరాటాలలో గత 25 సంవత్సరాలుగా విరామం లేకుండా పనిచేస్తూ మరోపక్క రాష్ట్రంలో, దేశంలో సామాజిక న్యాయం కోసం బహుజన ప్రజానీకాన్ని సమీకరించి పనిచేస్తున్న యువ నాయకుడు వనం సుధాకర్ ని ఎంసిపిఐ(యు) అభ్యర్థిగా బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీలు ప్రకటించడం… కుల, మతోన్మాద, దోపిడీ వర్గాలపైన మరింత ప్రజా చైతన్య కార్యక్రమాలను ఎక్కువ పెట్టి పని చేయడమేనని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు తాండ్ర కళావతి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు ఇ.దశరథ నాయక్ మియాపూర్ డివిజన్ కమిటీ నాయకులు గూడ లావణ్య, జి. శివాని, లలిత, అరుణ, ఇసాక్ పాల్గొన్నారు.