నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం, ఆసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ పెంపు, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయమని, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతిని అందించడం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.