శేరిలింగంపల్లిలో బీజేపీకి బిగ్ షాక్

  • బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ మొవ్వా సత్యనారాయణ  రాజీనామా
  • ఆయన బాటలోనే నాయకులు కార్యకర్తలు
  • త్వరలో ఏ పార్టీలో చేరుతామన్నది ప్రకటిస్తామని వెల్లడి

శేరిలింగంపల్లిలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ మొవ్వా సత్యనారాయణ, నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  బీజేపీ పార్టీలో సామాజిక న్యాయం జరగడం లేదన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మొవ్వ సత్యనారాయణ

జీహెచ్ఎంసీ పరిధిలో 18 లక్షలకు పైగా కమ్మ సామాజిక వర్గం ఉన్న ఒక్క సీటు కూడా తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడం, తమతో కనీసం చర్చించకుండా పార్టీ టికెట్ కేటాయించటం, టికెట్ ఇచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న బీజేపీ అధిష్టానం నుండి ఎటువంటి హామీ లభించకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలపర్చడానికి చాలామంది కార్యకర్తలు కష్టపడ్డారని, తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు, అనుచరుల కోసం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గానికి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తనతో సంప్రదింపులు జరుపుతున్నాయని, తన కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

మొవ్వ సత్యనారాయణ పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు, తన అనుచరులు

మొవ్వా సత్యనారాయణతో పాటు శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎం ఎల్ ఏ మట్ట సురేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అర్బన్ ఉపాధ్యక్షులు డి ఎస్ఆర్కె  ప్రసాద్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి లీలా ప్రసాద్, బీజేపీ శేరిలింగంపల్లి డివిజన్ ప్రాధాన కార్యదర్శి చిట్టా రెడ్డి ప్రసాద్, మాదాపూర్ టిడీపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ తన్నేరు ప్రసాద్, చందానగర్ డివిజన్ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శోభ దూబే, కాపు సంగం అధ్యక్షులు రమేష్, టిడీపీ మాదాపూర్ జనరల్ సెక్రటరీ భవాని, టిఎన్ఎస్ఎఫ్  జిల్లా వైస్ ప్రెసిడెంట్ నవీన్ చౌదరి, తెలుగు యువత ఉపాధ్యక్షులు మూర్తి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు సువర్ణ, టిఎన్ఎస్ఎఫ్ శేరిలింగంపల్లి ప్రెసిడెంట్ దుర్గా, స్టూడెంట్స్ లీడర్ పవన్ కుమార్, బీజేపీ హైదర్ నగర్ సెక్రటరీ కోడెల ప్రసాద్, సత్యనారాయణ, ప్రశాంత్, గిరి, శ్రీధర్, కిలారి ప్రసాద్, రామ్ సుబ్బా రెడ్డి, బాబ్జి, టౌఫీక్, లతీఫ్, పుల్లారావు, ఆనంద్ దూబే, కార్యకర్తలు, అనుచరులు కూడా బీజేపీ ఇతర పార్టీలకు రాజీనామా చేశారు. మొవ్వా సత్యనారాయణ ఏ నిర్ణయం తీసుకున్న మేము వారితో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here