నమస్తే శేరిలింగంపల్లి: ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు.. వివాహా కార్యక్రమాలకు పుస్తె మెట్టలు అందజేస్తూ అందరికీ ‘హోప్’ అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగానే పాపిరెడ్డి కాలనీవాసికి సహాయం అందించారు.

ఆ కాలనీకి చెందిన మనోహరి చారి కుమార్తె వివాహానికి హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ దంపతులు పుస్తె మెట్టలను హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం అందచేశారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు.