- ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధి ప్రశాంత్ నగర్ లోని భగవాన్ శ్రీ సత్య సాయి మందిర ప్రాంగణం వద్ద శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 98వ జన్మదినం నిర్వహించారు. మహా నారాయణ సేవ కార్యక్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్, ప్రసాద్ పాల్గొన్నారు.