నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్, స్వాభిమాని ఒడియా పరివార్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణ లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చేనేత హస్తకళా , ఫుడ్ సాంస్కృతిక కార్యక్రమాల ఉత్సవాన్ని రెండవ రోజు శిల్పారామం మాదాపూర్ ఆవరణలో ఎంతో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై , డి కే మొహంతి, బీపీ ఆచార్య, ఐఏఎస్ ( మాజీ) విచ్చేసి ఒడిశా ఉత్సవంలో పాల్గొన్నారు. చేనేత హస్త కళా ఫుడ్ స్టాల్ల్స్ ని కలియతిరిగి సందర్శించారు. స్వాభిమాన్ ఒడియా పరివారీ ప్రెసిడెంట్ సుస్మిత మిశ్ర, అర్చన మిశ్ర గవర్నర్ ని ఘనంగా సత్కరించారు.
హైదరాబాద్ లో నివసిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు. శిల్పారామం ఆవరణలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఒరిస్సా రాష్ట్రం నుండి చేనేత హస్తకళాకారులు చేనేత హస్తకళా ఉత్పత్తులను సందర్శకులు కొనుగోలు చేసారు. సంబల్పూరి స్టాల్, కోటపాడ్, మణిబంద్,సంతాలీ, పిపీలి అప్లిక్ వర్క్, డోక్రా ఆర్ట్, ఐరన్ ఆర్ట్, లాక్ గాజులు, మొదలైన స్టాల్ల్స్ , కోరాపుట్ కాఫీ , బర్త్ గుగుని, చాప్ కట్లెట్, దాహి బర్త్ ఆలూ డం, చానా మంద, రసాబాలి, పోడో పిటా , కాకర,అరిష మొదలైన ఫుడ్ స్టాల్ల్స్ సందర్శకులకు అందుబాటులో కొలువుదీరాయి.