జై జవాన్ జై కిసాన్ నిధికి… త్రివేణి విద్యా సంస్థలు విద్యార్థుల విరాళం

  • గవర్నర్ కి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: రాజ్ భవన్ లో త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి, వివిధ విద్యా సంస్థల నుంచి విద్యార్థి ప్రతినిధులు గవర్నర్ డాక్టర్ తమిళి సై ని కలిసి ‘జై జవాన్ జై కిసాన్’ కు విరాళం ప్రకటించారు. సైనికులకు రైతులకు మద్దతుగా నిలవడం కోసం విద్యార్థుల తరఫున, విద్యాసంస్థల తరఫున విరాళాన్ని చెక్ రూపంలో ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై విద్యార్థులు, యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

గవర్నర్  తమిళ సై కు విరాళం చెక్కును అందజేస్తున్న త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీరేంద్ర చౌదరి,

విద్యార్థులకు మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా త్రివేణి విద్యా సంస్థలు యాజమాన్యం, విద్యార్థులు వరుసగా మూడోసారి సైనికులకు రైతులకు మద్దతుగా విరాళం అందజేసినందుకు డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థులతో కలిసి అందజేస్తూ…

ఈ సందర్భంగా త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ జి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండే సైనికులను, భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహారాన్ని ఇతర పంటలను పండించి నిరంతరం కష్టం చేసే రైతన్నలకు మద్దతు తెలియజేస్తూ త్రివేణి విద్యాసంస్థల యాజమాన్యం విద్యార్థులు వారి సహాయార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జి వీరేంద్ర చౌదరి, పాఠశాల ప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here