జి.హెచ్.ఎం.సి అభివృద్ధికి నిధుల మంజూరుపై హర్షం

 • సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
 • శేరిలింగంపల్లి అభివృద్ధికి నిధులు కేటాయిస్తే కమిషనర్, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పనులు పూర్తి చేసుకుంటామని వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసి అభివృద్ధి కోసం రూ.1100కోట్లు, మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు జి.హెచ్.ఎం.సి కౌన్సిల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి కి శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జి.హెచ్.ఎం.సి కౌన్సిల్ లో ప్రసంగిస్తున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందని, నేడు ప్రవేశపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ సమావేశంలో నిధుల కేటాయింపుపై ప్రతి అంశంపై క్లుప్తంగా మాట్లాడి శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ నగర మేయర్ ని కోరారు. నూతన కమీషనర్ రోనాల్డ్ రోస్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా పూర్తి చేసుకుంటామని తెలిపారు.

 • బడ్జెట్ లో ప్రస్తావించిన ముఖ్యాంశాలు..
 • రూ.7937 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషకారమైన విషయం.
 • ప్రజలు కష్టపడి సంపాదించిన స్థలంలో ఈరోజు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోతుంది.
  శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలాల అభివృద్ధి పనులు చేపట్టాలి.
 • దళారులు,టౌన్ ప్లానింగ్ సిబంది ప్రజలను ఎంతో ఇబంధులు గురిచేస్తున్నారు.
 • అమీన్ పూర్,భవాని పురం కాలనీలో మధ్యలో ఉన్న నాల పనులు పూర్తి చేయాలి.
 • కమిషనర్లు, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు మరీనా టౌన్ ప్లానింగ్ సిబంది మాత్రం గత 15 సంవత్సరులగా ఒకే చోటా ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
 • యూ.సి.డి డిపార్ట్మెంట్ (ఆర్పీ, సమైక్య మహిళ గ్రూప్) అభివృద్ధి కోసం రూ.17.00కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషం.
 • రోడ్లు, బ్రిడ్జి, సీ.ఆర్.ఎం.పి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిధులు మంజూరు.
  రంజాన్ మాసం, బోనాల పండుగను దృష్టిలో పెట్టుకొని నూతన స్ట్రీట్ లైట్లు వాటి మరమ్మతులు చేపట్టాలి.

 • హైదరనగర్ డివిజన్ పరిధిలో నిజాంపేట్ కొలన్ రాఘవ రెడ్డి గార్డెన్ వద్ద చేపట్టాల్సిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలి.
 • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్కుల అభివృద్ధి కోసం కేటాయించిన రూ.285 కోట్ల నిధులు సక్రమంగా అమలు చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉన్న అనేక పార్కుల అభివృద్ధి వాటి పరిరక్షణ కోసం కృషి చేయాలి.
 • స్ట్రీట్ లైట్ల కోసం కేటాయించిన రూ.120 కోట్ల సక్రమంగా ఉపయోగించుకొని రానున్న రంజాన్, బోనాల పండుగకు లైట్ల కొరత లేకుండా చూడాలి.
 • శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అనేక డివిజన్ కాలనీలో ప్రజలు నూతన పోల్స్, స్ట్రీట్ లైట్లు, కేబుల్ అడగడం జరుగుతుంది.
 • అధికారులు మాత్రం పోల్ ఉంటే లైట్లు లేవని, లైట్లు ఉంటే కేబుల్ లేదని చెప్పడం జరుగుతుంది, ఈ నిధులు సక్రమంగా అమలు అయ్యేలా చూడాలి.
 • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టాక్స్ అస్సెస్మెంట్ చేయడం ద్వారా జి.హెచ్.ఎం.సి కి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది, తద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ, సర్వే నెంబర్ 80, పాపి రెడ్డి కాలనీ ఇలా అనేక కాలనీ/బస్తి ప్రజలు అక్కడ నివాసం ఉండే ప్రజలకు మేలు చేసిన వాళ్లం అవుతాం.
 • జిహెచ్ఎంసి పరిధి శానిటేషన్ డిపార్ట్మెంట్ లో కావాల్సిన మార్పుల పై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాల్సిందిగా కౌన్సిల్ మీటింగ్ లో బడ్జెట్ పై జరిగిన చర్చలో సూచనలు
 • స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో భాగంగా కేటాయించిన రూ.320 కోట్లు నిధులను ఉపయోగించి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా అన్ని చర్యలు చేపట్టాలి.
 • శానిటేషన్ శాఖలో ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులతో పాటు విదేశీ నగరాల తరహాలో కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందిగా సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సంవత్సరపు జిహెచ్ఎంసి బడ్జెట్ లో సాలిడ్ వేస్ట్ కోసం రూ.380 కోట్లు కేటాయించిన సందర్భంలో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్, మేడ్చల్ లో ఏర్పాటు చేసిన ప్లాంట్స్ లో ఈ వేస్ట్ ద్వారా 24 మెగా వాట్స్, 14 మెగా వాట్స్ ఎనర్జీ జనరేషన్ జరుగుతుండడం మంచి పరిణామం.
  స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ లో భాగంగా రూ. 320 కోట్లు కేటాయించిన సందర్బంలో రానున్న వర్షా కాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా అన్ని చర్యలు అధికారులు చేపట్టాల్సిందిగా జగదీశ్వర్ గౌడ్ సూచించారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here