నమస్తే శేరిలింగంపల్లి : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు.. మాదాల లక్ష్మీ నర్సింహ (29) కూకట్ పల్లిలో ఉంటూ బజాజ్ ఫైనాన్ష్ కార్ష్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక నెల క్రితం అతడికి నిశ్చితార్థం జరిగింది. 15వ తేదీన సాయంత్రం 6 గంటలకు గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన మామ ఈ విషయమై ప్రశతి హిల్ష్ లోని నిజాంపేట్ గ్రామంలో నివసించే కొడవటి కిషోర్ కుమార్ (34) కి తెలపగా.. అతడు 16వ తేదీన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.