బిజేపీ హయాంలో గ్యాస్ బండ సామాన్య ప్రజానీకానికి ఒక గుది బండ : ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

  • గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా ఎల్లమ్మ బండ గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో నిరసన
  • మోడీ దిష్టిబొమ్మ దహనం… ఫ్లకార్డులతో నిరసన
ఫ్లకార్డులతో నిరసన తెలుపుతూ.. మోడీ దిష్టిబొమ్మ దహనంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ, బి ఆర్ ఎస్ శ్రేణులు

నమస్తే శేరిలింగంపల్లి:  హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా.. బీఆర్ ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.  ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళ సోదరీమణులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భారత దేశ జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నదని, సామాన్యుడి పై అధిక భారం వేస్తూ , హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేఖంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు  నిరసన తెలిపామని చెప్పారు. గ్యాస్ బండ సామాన్య ప్రజానీకానికి ఒక గుది బండ లాగా మారిందని, వంట నూనెలు, పప్పు దినుసుల నుండి  పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మీ పాలన అచ్చే దిన్ కాదు, మీ ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు సచ్చేదిన్ అవుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళనాయకులు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీ ప్రతినిధులు, మహిళలు, బీఆర్ ఎస్ పార్టీ శ్రేయభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here