బాలిక మిస్సింగ్ కేసులో విషాదం

  • శవమై కుళ్లిపోయిన స్థితిలో.. లభ్యమైన వసంత మృతదేహం
  • అనుమానస్పద మృతిపై అనుమానాలు 
  • దర్యాప్తు ముమ్మరం చేసిన మియాపూర్ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి: మూడు రోజుల కిందట అదృశ్యమైన బాలిక శవవై కనిపించింది. ఈ విషాద ఘటన మియాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ దుర్గా రామ లింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబాబాద్ జిల్లా మర్రి పెడా మండల్ లక్ష్మ తండాకు చెందిన బానోత్ నరేష్, శారద దంపతులకు ఒక కుమారుడు , కూతురు వసంత(13) ఉన్నారు. గత 20 రోజుల కిందట స్వగ్రామం నుండి నగరానికి వచ్చి మియాపూర్ నడిగడ్డ తండాలో ఉంటూ జిప్టొలో పనిచేస్తున్నాడు. వసంత 7 వతరగతి చదువుతుంది. ఈ నెల 7న ఉదయం సమయంలో తండ్రి నరేష్, శారద చదువుకోమని చెప్పి మందలించి పనులకు వెళ్లారు. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో కనిపించక పోవడంతో చుట్టూ పక్కల, బందువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో తండ్రి నరేష్ ఫిర్యాదు చేశాడు.

వసంత (ఫైల్)

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే గురువారం రాత్రి సమయంలో నదిగడ్డ సమీపంలో చెట్ల పొదల్లో దుర్వాసన వస్తుందని స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా మృత దేహం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. మృత దేహం పై ఉన్న దుస్తులను గమనించి బాలిక వసంత గా గుర్తించి తల్లి దండ్రులకు సమాచారం అందించారు. వసంత అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here