నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ లోని శ్రీ సాయి గణేష్ దేవాలయ పున: నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆదిత్య నగర్ బస్తి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాసీం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మియాన్ పటేల్, కాజా, టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, ఏడుకొండలు, రాంచంద్రమూర్తి, నాగార్జున, విజయ్, నాని భక్తులు పాల్గొన్నారు.