ఉద్యోగమే కాదు.. క్రీడల్లోనూ మేటి

  • వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా రాణిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్యామ్
  • 100 కిలోల విభాగంలో బెంచ్ ప్రెస్ విభాగంలో బంగారు పథకం

నమస్తే శేరిలింగంపల్లి : ఒక వైపు ఉద్యోగం.. మరో వైపు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ గా రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ ఈసిఐల్ ప్రాంతానికి చెందిన శ్యామ్ జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం తను పడుతున్న తపన అతడిని అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ గా మార్చింది.

ఇందులో భాగంగానే ఈ నెల 15న బెంగుళూరులో 2023 సంవత్సరంనకు నిర్వహించిన జాతీయ స్థాయి  ప్రపంచం పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ ఇండియా (డబ్లూ పి సి )పోటీలలో పాల్గొన్నాడు. మాస్టర్ కేటగిరి 1. బాడీ వెయిట్ 100 కిలోల విభాగంలో బెంచ్ ప్రెస్ లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం పొందాడు. రిలెంట్ లెస్ జిమ్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీలో ప్రథమ బహుమతి పొందడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.

ముందు ముందు మరిన్ని పోటీలలో పాల్గొని తెలంగాణకు పేరు ప్రతిష్ట లు తీసుకు వస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో క్రీడ అభివృద్ధికి ఎంతో సహకారం అందించిందన్నాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here