హస్తం గుర్తుకు ఓటేయండి

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరందుకుంటున్నది. ఆ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రజల ఆదరణ చూరగొంటున్నది. ఇందులో భాగంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి  జెరిపాటి జైపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ పల్లపు పోచయ్య అధ్యక్షతన గచ్చిబౌలి డివిజన్ , రాజీవ్ నగర్ , వీకేర్ సెక్షన్ , గోపంపాలీ విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల కర పత్రాలను పంపిణీ చేశారు.

రాబోయే ఎన్నికల్లో గద్దెనెక్కేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు.  ప్రజల నుంచి వస్తున్న స్పందనకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సేవాదళ్ చీఫ్ శేఖర్ , రాజేందర్, కవిరాజ్ తలారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here