అభివృద్ధి శిలాఫలకాల ఏర్పాటు బూటకం.. ఓట్ల కోసమే నాటకం

  • ఐదేండ్లలో ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ. 28 కోట్ల అభివృద్ధి చేశానని చెప్పడం అబద్ధం
  • సీడీపీ నిధులతో అభివృధ్ధి చేసింది రూ. కోటి మాత్రమే
  • ఆధారాలతో సహా నిరూపిస్తాం.. ఆపద్ధర్మ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా…
  • ప్రభుత్వ విప్ గాంధీకి బీజేపీ కన్వీనర్ రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సవాల్

నమస్తే శేరిలింగంపల్లి : నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల సమయంలో  శంకుస్థాపన చేసిన శిలాఫలకాల పనులే ఇప్పటిదాకా చేపట్టలేదు, తిరిగి ఇప్పుడు ఎన్నికల వేళ శేరిలింగంపల్లిలో సుమారు 300-400 కోట్ల రూపాయలతో  100కు పైగా  శిలాఫలకాలు ఏర్పాటు ఓట్ల కోసమేనని బీజేపీ కన్వీనర్ రాఘవేంద్రరావు, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి అన్నారు. ఇప్పుడు చేపట్టనున్న పనులకు నిధులే సాంక్షన్ కాలేదని, ఇంతవరకు పనిచేసినా తమకు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు సమ్మెలో కొనసాగుతున్నారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి ఎన్నికల ముందు శిలాపలకాలు పెట్టి అభివృద్ధి చేస్తాను  ఓట్లు వేయండి అంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఐదేండ్లలో రూ. 28 కోట్ల సీడీపీ నిధులతో అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటున్నారు కానీ చేసింది కోటి రూపాయల పనులు మాత్రమేనని వెల్లడించారు.

ఆధారాలతో సహా నిరూపిస్తాం.. చర్చకు సిద్ధమా.. అంటూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సవాల్ విసిరారు. ఆర్టీఐ, కలెక్టర్ కార్యాలయాల నుంచి సేకరించిన వివరాలను పత్రిక సోదరులకు  అందజేస్తున్నాను దమ్ముంటే చర్చకు రండి అని తెలిపారు. అభివృద్ధి పనుల శిలాఫలకాల ఏర్పాటు జీహెచ్ఎంసీకి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు, మరి శిలాఫలకాలపై వారి పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు ఎందుకు నమోదు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు శిలాపలకాలను ఈఈ, డిఈ, ఏఈ, వర్క్ ఇన్ స్పెక్టర్లు కలసి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ఈ. ఈ, డి. సి సమాధానం చెప్పాలని, శిలాపలకాల ఏర్పాటులో ప్రజాప్రతినిధులకు సహకరించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు ఏర్పాటు చేసిన శిలాఫలకాలు పెట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

  • ఐదేండ్లలో 2018 – 2023 వరకు  ఎమ్మెల్యే (సీడీపీ) ఫండ్స్ ద్వారా చేసిన పనుల వివరాలను వెల్లడించారు.
  •  సంక్షన్ చేసిన  పనులు 69
  • నిధులు మంజూరైనా  పనులు –  19
  • పూర్తి చేసిన పనులు –  14
  • నిధులే విడుదల కానీ పనులు 36

ఈ కార్యక్రమంలో కన్వీనర్ రాఘవేంద్రరావు, ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ త్రినాధ్, రంగారెడ్డి జిల్లా ఎగ్జిసిటివ్ చందర్ రావు, మైనారిటీ జీఎస్ గౌస్, చందానగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు మల్లేష్ గౌడ్, జనార్దన్ మూర్తి, అనంత రెడ్డి, కృష్ణ దాస్, విజయ్, మాజీ వార్డ్ మెంబెర్ రమణ కుమారి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here