అధికారం ఉన్నా.. లేకున్నా పేదలకు సేవ చేయడమే లక్షం: రవికుమార్ యాదవ్

  • సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోట్ బుక్స్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజలకు సేవ చేసే బాటలో పయనించడమే తన తండ్రి భిక్షపతి యాదవ్ చూపిన మార్గమని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందాలనే దృఢమైన సంకల్పంతో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి ఆల్విన్ కాలనీ డివిజన్ షంషీగూడ, ఎల్లమ్మ బండ ప్రభుత్వ పాఠశాలలో ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఉచితంగా నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తూ తమ ట్రస్టు గత 22 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా బుక్స్ పంపిణీ చేపడుతున్నదని తెలిపారు. అదేవిధంగా ఒక హాస్పటల్ స్థాపించి కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయడం తమ ట్రస్టు ప్రత్యేకత అని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజలకు సేవ చేయడమే తన తండ్రి బిక్షపతి యాదవ్ చూపిన మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, అరుణ్ కుమార్, కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి, సీతారామరాజు, కృష్ణ గౌడ్, ఎత్తరి రమేష్, నర్సింగ్, కృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, సురేష్, రాము, చాంద్ సైదమ్మ, పద్మ, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here