- ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్, సెక్రటరీ రవికుమార్ యాదవ్ లను అభినందించిన కర్ణాటక ఎమ్మెల్యే
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. పేదవారికి కంటి అద్దాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ దానిని దానం చేసే గుణం కొంతమందికే ఉంటుందని, అందులో భిక్షపతి యాదవ్ ముందు వరుసలో ఉంటారని తెలిపారు. అంతేకాక తండ్రి బాటలో నడుస్తున్న యువ నాయకుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ కూడా బిజెపి బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి నాయకులను, కార్యకర్తలను కలుపుకుపోవడం పట్ల సంతోషించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడానికి ముఖ్య కారకుడు అవుతాడని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, అనంతరెడ్డి , మణి భూషణ్, దేవాల్ యాదవ్, మహిపాల్ రెడ్డి, నవత రెడ్డి , సింధు రెడ్డి, ఎల్లేష్,శ్రీధర్ గౌడ్, కోటేశ్వరరావు, రామ్ రెడ్డి, అర్జున్ రమణయ్య , శ్రీనివాస్ యాదవ్, రమేష్, రాజేష్, రాజు, లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్ గౌడ్, రమేష్, యాదగిరి ముదిరాజ్, రమేష్ , సత్యనారాయణ దేవానంద్ యాదవ్, చందర్ యాదవ్, గౌస్, కృష్ణ దాస్, మన్యం శ్రీనివాస్ పాల్గొన్నారు.