- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి సర్వీ సమాజ్ ట్రస్ట్ శేరిలింగంపల్లి ప్రతినిధుల వినతి
నమస్తే శేరిలింగంపల్లి: మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సర్వీ సమాజ్ ట్రస్ట్ శేరిలింగంపల్లి ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, సర్వీ సమాజ్ ట్రస్ట్ సభ్యులు అధ్యక్షులు మనోజ్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్లు మంగిలాల్ పరిహరియా చౌదరి, కంగర్ సొయాల్ చౌదరి, సెక్రటరీ హనుమన్ సోయల్ చౌదరి ,సెక్రటరీ మంగిలాల్ సొన్పర చౌదరి, ట్రెజరర్ వినోద్ గెహ్లాట్ చౌదరి, వినోద్ చౌదరి, వినయ్ చౌదరి, కెహ్వరామ్ చౌదరి పాల్గొన్నారు.