- ఉస్మానియా యూనివర్సిటీ లో వారిద్దరూ మంచి బాల్య మిత్రులు
నమస్తే శేరిలింగంపల్లి : ఉస్మానియా యూనివర్సిటీలో వారిద్దరూ మంచి మిత్రులు. ప్రస్తుతం ఒకరు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం.. మరొకరు సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి. శోభన్. నేడు సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి. శోభన్ ని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి. వీరిని సీనియర్ జర్నలిస్టు పులి అమృత్ గౌడ్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కొంగరి కృష్ణ పాల్గొన్నారు.