నమస్తే శేరిలింగంపల్లి: గౌడ హాస్టల్ ఆధ్వర్యంలో నందిగామ గ్రామంలో నిర్మిస్తున్న నూతన హాస్టల్ భవన నిర్మాణం కోసం శేరిలింగంపల్లికి చెందిన గౌడ సంఘం ప్రముఖులు పి.వీర్ కుమార్ గౌడ్ రూ.1 లక్ష విరాళాన్ని అందించారు. అందుకు సంబంధించిన చెక్కును శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, గౌడ హాస్టల్ ఉపాధ్యక్షులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, సంయుక్త కార్యదర్శి అశోక్ గౌడ్ లతో కలిసి హాస్టల్ అధ్యక్షుడు చక్రధర్ గౌడ్ కి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ హాస్టల్ అభ్యున్నతి కోసం కృషి చేసే వారికి యావత్ గౌడ సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. యువత భవిష్యత్తుకు గౌడ హాస్టల్ ఎంతగానో ఉపయోగ పడుతుందని, అందుకు దాతల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో గౌడా హాస్టల్ ప్రముఖులు పాల్గొన్నారు.