నమస్తే శేరిలింగంపల్లి: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ లోని శిల్పారామంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సత్యం డాన్స్ అకాడమీ కామేశ్వరి శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. గణపతి గీతం, కస్తూరి తిలకం, సతులారా చూడరేయ్, ఆడే పాడే పిల్లలం అంశాలను సంహిత, అక్షిత, అలేఖ్య, సాయి సహస్ర, సౌమ్య తదితరులు ప్రదర్శించి అందరిని అలరింపజేశారు. శ్రీ నారాయణి నృత్యాలయా శ్రీ సంతోష్ కుమార్ తమంగ్ శిష్యబృందం భరతనాట్య ప్రదర్శనలో పుష్పాంజలి, శివ స్తుతి, కాలాయి థూకి, నాతనం ఆదినార్, శ్రీ రామచంద్ర భజన, హనుమాన్ చాలీసా, తిల్లాన అంశాలను అవని, మాన్వి, మనీషా, అంకిత, పద్మ, ఉర్విజ తదితరుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.






