శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అభినందించారు. మసీద్ బండలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ప్రభాకర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి శూల్యలింగం, ఉపాధ్యక్షులు సందీప్, జగన్మోహన్ గుప్తాతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను రవికుమార్ యాదవ్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య మండల అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి నూతన కార్యవర్గం కట్టుబడి పనిచేయాలని సూచించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని ఆర్యవైశ్య సంఘాలు, సభ్యులను సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి భవిష్యత్తులో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని రవికుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ రాజు గుప్తా, అశోక్ గుప్తా, పాండు గుప్తా, రేఖ, ఆనంద్ గుప్తా, సంతోష్, కమలాకర్, కిషోర్ గుప్తా, శ్రీనివాస్ గుప్తా తదితర ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.





