స్వాభిమానం, సమానత్వం కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 18 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై పుట్టిన ధైర్యవంతుడైన మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన జీవితం ధైర్యం, ఆత్మగౌరవం, సమానత్వం, ప్రజా పోరాటానికి ప్రతీకగా నిలిచిందన్నారు.

17వ శతాబ్దంలో అణగారిన ప్రజల హక్కుల కోసం పాపన్న గౌడ్ పోరాడారని, సామాజిక, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి వారిలో ధైర్యాన్ని నింపారని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. సర్వాయిపేట, తాటికొండ, షాపూర్ కోటలు ఆయన వీరోచిత పోరాట చరిత్రకు ప్రతీకలుగా నిలిచాయని తెలిపారు. అధికారం కొందరి చేతుల్లోనే ఉండకూడదని, అణగారిన వర్గాలకు కూడా గౌరవం, నాయకత్వం, అధికారం ఉండాలనే గొప్ప ఆలోచనతో పాపన్న గౌడ్ పోరాడారని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్యాయానికి తలవంచకుండా ధైర్యంగా పోరాడాలనే స్ఫూర్తిని ఆయన జీవితం అందిస్తోందన్నారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, న్యాయం కోసం కృషి చేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని రవికుమార్ యాదవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గౌడ్‌తో పాటు కరుణాకర్ గౌడ్, నాగులు గౌడ్, యాదగిరి గౌడ్, గౌతమ్ గౌడ్, రాజేష్ గౌడ్, ఏకాంత్ గౌడ్, దశరథ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వినయ్ గౌడ్, దాత్రినాథ్ గౌడ్, మహేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కల్పనా గౌడ్, విక్రమ్ గౌడ్, మహేష్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here