శేరిలింగంపల్లి, ఆగస్టు 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మంగళవారం జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీప్తిశ్రీనగర్లోని బీటీ ప్లాంట్ను తనిఖీ చేసిన ఆయన, అనంతరం మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల ఫిర్యాదులు, వినతులు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలను ఆరా తీశారు.






