నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని స.నెం.28 లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ వెంకారెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు ఆర్ఐ శ్రీను తెలిపారు.
మియాపూర్ సర్వే నెంబర్ 28 ప్రభత్వ భూమి అని అన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మళ్లీ నిర్మాణాలు పునరావృతమైతే సహించమని పేర్కొన్నారు.