- ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేద్దాం
- ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా కృషి చేస్తా : శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : హైదరనగర్ డివిజన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని బలం చేకూర్చే విధంగా మీ వెంటే నడుస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, కూన సత్యం, డివిజన్ అధ్యక్షులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.