కమ్యూనిటీ హాల్ ని సద్వినియోగం చేసుకోవాలి

  •  శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో రూ. 30 లక్షల అంచనా వ్యయం తో ఎమ్మెల్యే (CDP FUNDS ) నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ హాల్ ను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక నాయకులు , కాలనీ వాసులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే (సిడిపి నిధుల ) నుండి 30 లక్షలు మంజూరి చేశామని, త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం అని, కమ్యూనిటీ హాల్ ను కాలనీ సంక్షేమం , అభివృద్ధి కోసం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ సందర్బంగా  కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మీ నగర్ కాలనీ వాసులు బాలు చౌదరి, శ్రీధర్, రామిరెడ్డి, నరేష్ , సాంబయ్యా, నరేంద్ర, శ్రీనివాస్ , రత్నాకిషోర్, నాయుడు, రాణి, జయలక్ష్మి, రాజేశ్వరి, కల్యాణి, మాధవి, భారతి, సత్యనారాయణ, హరి, మణయ్యా, లక్ష్మి నారాయణ, అమలేష్ రావు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here