నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ / తహసీల్దార్ గా కె.వెంకారెడ్డి నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న కె.వెంకారెడ్డిని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ గా నియమిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరి నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ రావు సస్పెషన్ కు గురైన విషయం విదితమే.
కాగా రాజేంద్రనగర్ డివిజన్ ఆరిడీఓ మల్లయ్య ఇక్కడ ఇన్చార్జీ డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరించారు. ఐతే మల్లయ్య తాజాగా గోధావరి ఖనికి బదిలీ అవ్వగా ఆయన స్థానంలో కే.వెంకట ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు.