కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి: శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : భారత్ వికసిత సంకల్ప్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారికి అక్కడనే లబ్ది చేకూర్చటం కోసం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో జనప్రియ నగర్ అపార్ట్మెంట్స్ వద్ద సమావేశం నిర్వహించారు.

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో జనప్రియ నగర్ అపార్ట్మెంట్స్ వద్ద సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్న రవికుమార్ యాదవ్

ఈ సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. భారతదేశం అధివృద్ది పథంలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలతో పేద , మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారనీ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతూ…

మహిళల కోసం ఉజ్వల యోజన, పీఎం స్వనిధి, పేద ప్రజల ఆరోగ్యం కోసం పీఎం సురక్ష బీమా, ఆయుష్మాన్ భారత్ , చిరు వ్యాపారులు కోసం ముద్ర లోన్, చేతి వృత్తులు వారికోసం విశ్వకర్మ యోజన, ఆధార్ అప్డేట్స్ వంటి అనేక కేంద్ర పథకాలు అందరికీ అందాలనే సదుద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హత ఉన్నవారికి లబ్ధి చేకూరేలా చేయడం ఎంతో మందికి ఉపయోగకరమని అన్నారు,ఈ కార్యక్రమాన్ని అన్ని కాలనీలు, బస్తిలలో నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి కిరణ్ కుమార్, ఆరోగ్య అధికారి శ్రీ డాక్టర్ అరవింద్, బ్యాంక్ మార్కెటింగ్ అధికారి తేజ, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ , మనోహర్ , రవి గౌడ్ , జితేందర్ , బాబు రెడ్డి, వర ప్రసాద్, శ్రీశైలం కురుమ,పృథ్వి , శ్రీనివాస్ యాదవ్ , కోటేశ్వర రావు, రవి, పావని, శివారెడ్డి, కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here