నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ ను ఎమ్మెల్యే గాంధీ సహకారంతో ఆదర్శవంతమైన డివిజన్ గా మార్చటానికి అభివృద్ధి పనులను చేయిస్తున్నామని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాధవహిల్స్ అర్బర్ స్కూల్ నుంచి రాజరాజేశ్వరి కాలనీ స్విమ్మింగ్ పూల్ వరకు రూ. 50 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. అనంతరం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో రూ. 40 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను స్థానిక నాయకులు, ప్రజలతో కలసి పరిశీలించి బస్తీలో పాదయాత్ర చేపట్టారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. కొండాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు, ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటున్నామన్నారు. ఆదర్శవంతమైన డివిజన్ గా కొండాపూర్ ను తీర్చిదిద్దటానికి వాడవాడలోను అభివృద్ధి పనులను చేయిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారి ఏఈ జగదీష్, వర్క్ ఇన్ స్పెక్టర్, వెంకటేష్, మొహ్మద్ అలీ, తాడెం మహేందర్, అజ్జు, కలీం, లక్ష్మి, ఆసియ బేగం, రజిని, బన్నీ బాయి, మొహ్మద్ మోసిన్, మతిన్, అష్రాఫ్, మొబషీర్ పాల్గొన్నారు.