జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు పి జే ఆర్ స్టేడియం స్టూడెంట్స్

నమస్తే శేరిలింగంపల్లి : జాతీయస్థాయి బాక్సింగ్ క్రీడా పోటీలకు PJR స్టేడియం కి చెందిన శశికళ నాయుడు, హేమంత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాక్సింగ్ శిక్షకుడు గిరిబాబు మాట్లాడుతూ తన విద్యార్థులు తన శిక్షణలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపీ కావడం ఆనందంగా ఉందని తెలిపారు. వచ్చేనెల బీహార్లో పాట్నా లో జరగనున్న జాతీయ జూనియర్ స్థాయి క్రీడలకు హేమంత్ కుమార్ ఎంపిక కాగా, వచ్చే నెల హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి సీనియర్ స్థాయిలో శశికళ నాయుడు ఎంపికవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ క్రీడాకారుడు ఎస్సై కోటేశ్వరరావు, మహిళ బాక్సింగ్ శిక్షకురాలు ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు క్రీడాకారులతో బాక్సింగ్ శిక్షకుడు గిరిబాబు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here