ప్రజా సమస్యలే పరిష్కారంగా ముందుకు వెళ్ళాలి

  • అధికారులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ లలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి, ప్రజా సమస్యలే పరిష్కారంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులను ఆదేశించారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ, ఈనాడు కాలనీ, సప్తగిరి కాలనీ, వివేకానంద నగర్ అపార్ట్ మెంట్, ఏ ఎస్ రాజు నగర్, మెడికల్ సొసైటీ, రామకృష్ణ స్ట్రీట్ కాలనీలలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజాదేవి రంగరావు, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ ఎంసీ, వివిధ ప్రభుత్వ అధికారులు మీ ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

రోడ్లు, డ్రైనేజి, మంచి నీటి సమస్య, నాల సమస్యలు, ఫూట్ ఫాత్, పార్క్ విధి దీపాలు, తడి చెత్త ,పొడి చెత్త నిర్వహణ, దోమల బెడద, కుక్కల బెడద రక్షణ చర్యలు, మహిళ సంరక్షణ చర్యలు, జ్వరం, ఆరోగ్య సమస్యలు, ట్రాఫిక్, పోలీస్ డయల్ 100, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ , విద్యుత్ లైన్ లు వంటి వివిధ సమస్యల పై తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, సిఐ సురేందర్, జిహెచ్ ఎంసీ అధికారులు ఏ ఈ ఆశా, ఏ ఎంహెచ్ ఓ మమత , జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రియాంక , స్ట్రీట్ లైట్స్ ఏ ఈ మృదుల, టిపిఎస్ సోమేశ్, వెటర్నరీ డాక్టర్ లింగస్వామి మరియు వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, కార్తిక్ రావు, రాంచందర్ రావు, హిమగిరి రావు, ఎర్రబెల్లి సతీష్, విజయ్ బాబు, అల్లం మహేష్, కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు దేవినేని ప్రసాద్, శర్మ, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య మరియు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here