నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామం లో అంతర్జాతీయ నృత్యోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా శిల్పారామం, పరంపర డాన్స్, మ్యూజిక్ ఫోరమ్, ప్రముఖ కథక్, విలాసిని నృత్య కళాకారులు గురువు సంజయ్ జోషి సంయుక్త నిర్వహణలో జంట నగరాలలోని కథక్ నృత్య గురువులు శిష్య ప్రశిష్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ నృత్య రీతులలో, లక్నో ఘరానా, జైపూర్ ఘరానాలో గురువులతోపాటు శిష్య ప్రశిష్యులు గురు వందన, శిక్ వందన, సరస్వతి వందన, దశావతార, బసంత్ రాస్, సర్గం, హోలీ, తరణ అంశాలలో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆర్తి శంకర్, యోగిని ఖరోన్కర్, అర్చన మిశ్ర, శ్రీవల్లి రావు, సుబ్రత్ సర్కార్, శిల్ప చక్రవర్తి, కుమార స్వామి, మోహన్ రెడ్డి, పూనమ్ జాంవల్లే, శిష్యులతో ప్రదర్శనలో పాల్గొన్నారు.