నమస్తే శేరిలింగంపల్లి: పిల్లలలో దాగున్న నైపుణ్యతను గుర్తించి, ఆ దిశగా అడుగులు వేయించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జిహెచ్ ఎంసీ శేరిలింగంపల్లి జోన్, కూకట్ పల్లి జోన్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2023ను జోనల్ కమిషనర్ శంకరయ్య, చందానగర్ సర్కిల్ డీసీ సుధాంష్ , శేరిలింగంపల్లి సర్కిల్ డీసీ వెంకన్న, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఏప్రిల్ 25 నుండి మే 31 వరకు ఈ క్యాంపు నిర్వహిస్తారని, మనిషి జీవితంలో చదువు, సంపాదనతోపాటు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి సమ్మర్ క్యాంపులో పుల్లెల గోపిచంద్, పివి సింధు క్రీడాకారులు కోచింగ్ తీసుకుని అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అత్యుత్తమ పథకాలు సాధించి, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని, దేశం పేరు ను విశ్వవ్యాప్తంగా చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఓ. వెంకటేష్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి మన్విత పాల్గొన్నారు.
