సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు ఖరీదైన వైద్యం

  • సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 6 లక్షల 25 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని దీనబంధు కాలనీకి చెందిన మాస్టర్ ఎస్.కృష్ణ కుమార్ కి 1లక్ష 25వేలు, కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన మల్లీశ్వరి గౌడ్ కి రూ. 1లక్ష , చందానగర్ డివిజన్ పరిధిలోని PA నగర్ కాలనీ కి చెందిన ఆంజనేయులుకు రూ. 1 లక్ష, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కి చెందిన కనక సింహ చలంకు రూ. 1లక్ష, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని చంద్రమ్మ కాలనీకి చెందిన మధుకు రూ. లక్ష, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఈనాడు కాలనీ కి చెందిన దుర్గ కు రూ. 1లక్ష మంజూరు కాగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రాలను అందజేశామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్, అల్లం మహేష్, అష్రాఫ్, స్వామి నాయక్, తిరుపతి, లకుపతి పాల్గొన్నారు.

బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here