శేరిలింగంపల్లిలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దళితులందరికీ దళిత బందు ఇవ్వాలని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పాలమాకుల జంగయ్య అన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దీనికి విప్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు సిపిఐ రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు. కే వెంకట స్వామి, కె చందు యాదవ్ , మండల నాయకులు ఎం వెంకటేష్, బాలు, జె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పాలమాకుల జంగయ్య , ఆ పార్టీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here