నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ ఉషోదయ సిగ్నేచర్ సమీపంలో నుతనంగా నిర్మిస్తున్న సిసిరోడ్డు పనులను జిహెచ్ ఎం సి అధికారులతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పరిశీలించారు. కాలనీ వాసులకు ఇబ్బంది కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయలతో చందానగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎం సి అధికారులు కాలనీవాసులు పాల్గొన్నారు.