- పూజలు ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: బోనాల పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లోని శ్రీ తుల్జాభవాని అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో తుల్జా భవాని యూత్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు వేడుకగా జరిగింది. ఈ ఫలహారం బండి ఊరేగింపుని కొబ్బరికాయ కొట్టి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ ప్రజలకు బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.
బోనాల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరిగేలా అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ యాదవ్, చింతకింది రవీందర్ గౌడ్, పద్మారావు, కృష్ణ యాదవ్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, నటరాజు, శ్రీనివాస్, నిర్వాహకులు బండి సత్తయ్య, బండి పాండు, బాల్ రాజ్, బండి ప్రసాద్, బండి ప్రసాద్, బండి గోపి, హరి, సురేందర్ పాల్గొన్నారు.