నమస్తే శేరిలింగంపల్లి: మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని హఫీజ్ పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.