నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో బీహార్ కనెక్ట్ చేనేత హస్తకళా మేళ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. హైదరాబాద్ బీహార్ ఫౌండేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిరామజి , ఉత్తమ్ యాదవ్ బీహార్ ఫౌండేషన్ హైదరాబాద్ చాప్టర్ జనరల్ సెక్రటరీ, జనరల్ మేనేజర్ శిల్పారామం అంజయ్య మేళని ప్రారంభించారు. బీహార్ రాష్ట్రం నుండి దాదాపుగా నూటఇరవై చేనేత హస్తకళా ఉత్పత్తుల కళాకారులు హాజరయ్యారు.
టికులై ఆర్ట్, మధుబని పెయింటింగ్, వుడెన్ క్రాఫ్ట్, స్టోన్ కార్వింగ్, చీర పై డ్రెస్ పై మధుబని పెయింటింగ్, వెదురుతో తయారు చేసిన బుట్టలు, బొమ్మలు, గృహోపకరణాలు, బీహార్ రాష్ట్రానికి చెందిన రుచులు ఫుడ్ స్టాల్ ని ఏర్పాటు చేశారు. లిట్టిచౌక, చంద్రకళ, అనర్స, రాబ్దికుల్ఫీ, మలైకుల్ఫీ, మొదలైన వంటకాలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బిందుఅభినయి గారి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.