- అధికారులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆదేశం
- లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనుల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చేపడుతున్న బాక్స్ కల్వర్ట్, వరద నీటి కాల్వ నిర్మాణం పనులను పరిశీలించామని తెలిపారు. పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని, పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని, పనుల నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. శేరిలింగంపల్లిలో అనేక రోడ్లు, లింక్ రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించి ప్రజలకు సుఖవంతమైన ట్రాఫిక్ రహిత సమాజం కోసం కృషి చేశామని ఎమ్మెల్యే గాంధీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎస్ ఈ శంకర్ నాయక్ , ఈఈ కేబీఎష్ రాజు, డీఈ దుర్గాప్రసాద్, ఏఈ సంతోష్ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందీప్ రెడ్డి, పాల్గొన్నారు.