- ముంబాయి జాతీయ రహదారిపై బిఆర్ఏస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

నమస్తే శేరిలింగంపల్లి : పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చందానగర్ డివిజన్ గాంధీ విగ్రహం వద్ద బిఆర్ఏస్ పార్టీ చందానగర్ డివిజన్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి టీ(Tea)తయారు చేసి బిఆర్ఏస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందజేశారు. అనంతరం ముంబాయి జాతీయ రహదారిపై బిఆర్ఏస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలను పెంచుతుందని ఇప్పటికే పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ ధరను పెంచి మహిళ దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుకగా ఇచ్చిందని విమర్శించారు. రానున్న రోజుల్లో మహిళలు కుడా మోడీ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారని, వచ్చే ఎన్నికల్లో ఎండీఏ ప్రభుత్వం ఓటమికి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిఆర్ఏస్ పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ గౌడ్, పబ్బ మల్లేష్ గుప్తా, ఓరుసు వెంకటేష్, పులిపాటి నాగరాజు, అక్బర్ ఖాన్, యుసుప్ ఖాన్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
